పూరి నెక్స్ట్ మూవీ... అంతా రెడీ

Sunday,July 15,2018 - 11:10 by Z_CLU

ఇటివలే తనయుడు ఆకాష్ హీరోగా ‘మెహబూబా’ సినిమాను తెరకెక్కించిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. మరోసారి ఆకాష్ తోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్నాడు పూరి. ‘మెహబూబా’ రిలీజ్ టైంలో ఆకాష్ తోనే నెక్స్ట్ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చిన డాషింగ్ డైరెక్టర్ ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసేసాడు. ఇప్పటికే స్టోరీ రెడీ చేసిన పూరి ఆగస్ట్ నుండి ఈ సినిమాతో సెట్స్ పైకి వెళ్ళబోతున్నాడని సమాచారం.

పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నాడు పూరి. లవ్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాకు సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించనున్నాడు. త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తుంది.