'లవర్' ట్రైలర్ రివ్యూ

Sunday,July 15,2018 - 10:02 by Z_CLU

రాజ్ తరుణ్ , రిద్ది కుమార్ జంటగా హర్షిత్ రెడ్డి నిర్మాణంలో అనిష్ కృష్ణ తెరకెక్కించిన ‘లవర్’ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇటివలే టీజర్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా ప్రెజెంట్ ట్రైలర్ తో సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. “నేను రాజ్ ఈ స్టేట్ లోనే బెస్ట్ కస్టమైజ్ మోటో బైక్ బిల్డర్” అంటూ రాజ్ తరుణ్ డైలాగ్ తో ప్రారంభమైన ఈ ట్రైలర్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలియజేస్తూ అంచనాలు పెంచేసింది.

“ఎవడికో నచ్చినట్టు ఎవడో చేసిన బైక్ నాకెందుకు..నాకు నచ్చినట్టు నేను చేసుకుంటా…అది బైక్ అవ్వని లైఫ్ అవ్వని” అంటూ రాజ్ తరుణ్ చెప్పే డైలాగ్ సినిమాలో రాజ్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో తెలియజేస్తుంది. ఇక హాస్పిటల్ లో సిస్టర్ గా పనిచేసే మలయాళం అమ్మాయి చరిత(రిద్ధి కపూర్)ను రాజ్(రాజ్ తరుణ్) ఎలా ఇంప్రెస్ చేసి ప్రేమలో దింపాడు అనే లవ్ సీన్స్ ట్రైలర్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి. “మీరందరికీ సిస్టరే కానీ నాకు మాత్రం డాక్టర్” అంటూ  వచ్చే ఫన్నీ  సీన్, ఎంద చాటా… డార్లింగ్ అంటూ రాజ్ డైలాగ్స్ తో వచ్చే సీన్స్ థియేటర్స్ లో ప్రేక్షకులను నవ్వించడం ఖాయంమనే విషయాని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా “ఎవరూ లేరా.. నేనే ఏ..? ” అంటూ చరిత అడిగిన ప్రశ్నకు.. “ఎందుకంటే నాకే కాదు ఎవ్వురికి తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కో అమ్మాయి ను చూసినప్పుడు ఒంట్లో ఏదో వోల్టేజ్ ఫ్రక్చువేషన్..” అంటూ రాజ్ లవ్ గురించి చెప్పే సీన్ సినిమాలో హైలైట్ కానునుందని తెలుస్తుంది.

అలా కూల్ గా సాగిపోతున్న ట్రైలర్   “ఆడు నాకు కావాల”  అంటూ అజయ్ చెప్పే డైలాగ్ తో  సీరియస్ మోడ్ లోకి వెళ్ళింది.ఆ తర్వాత వచ్చే యాక్షన్  ఎపిసోడ్స్ సినిమాలో యాక్షన్ కి కూడా స్పేస్ ఉందనే సంగతి తెలియజేస్తున్నాయి. ఫైనల్ గా “మనం ఈ లోకంలో లేకపోయినా మనల్ని ఎవరైనా తలుచున్నారంటే మన జీవితానికి ఓ అర్ధం వచ్చినట్టే…’ అంటూ చరిత అనడం దానికేముందు పోయే ముందు ఏ కొడుకు దగ్గరైనా ఓ నాలుగు లక్షలు అప్పు చేసి పోతే జీవితాంతం తలుచుకుంటానేఉంటాడు”.. అంటూ రాజ్ పేల్చిన కామెడి పంచ్ తో ఈ ట్రైలర్ ఎండ్ అయింది.

ముఖ్యంగా సమీర్ రెడ్డి ‘ఫోటో గ్రఫీ’, జే.బి బ్యాగ్రౌండ్ స్కోర్, లోకేషన్స్, ‘SVC’ బ్యానర్  ప్రొడక్షన్ వాల్యూస్ ట్రైలర్ లో హైలైట్స్ గా నిలిచాయి.