నితిన్ 'శ్రీనివాస్ కళ్యాణం'... టీజర్ రెడీ
Sunday,July 15,2018 - 12:30 by Z_CLU
ఈనితిన్, దిల్ రాజు, సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ‘శ్రీనివాస కళ్యాణం’ టీజర్ రెడీ అయింది… ఇటివలే ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసిన మేకర్స్ ఈ వారంలో టీజర్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సినిమా థీమ్ తెలియజేసేలా ఓ కాన్సెప్ట్ టీజర్ ను రెడి చేసినట్టు సమాచారం. సో ప్రెజెంట్ ‘కళ్యాణం వైభోగం’ సాంగ్ తో అందరినీ ఎట్రాక్ట్ చేస్తున్న ఈ సినిమా నెక్స్ట్ వీక్ నుండి టీజర్ తో హంగామా చేయబోతుంది.

ఒక పాట మినహా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలోనే బ్యాలెన్స్ సాంగ్ ను షూట్ చేసి శ్రావణ మాసం సందర్భంగా ఆగస్ట్ 9న విడుదల చేయనున్నారు. నితిన్ సరసన రాశి ఖన్నా , నందిత శ్వేతా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడు.