'లైగర్' అంటున్న విజయ్ దేవరకొండ !

Monday,January 18,2021 - 12:03 by Z_CLU

Puri JagannathVijay Deverakonda కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు ‘Liger’ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేస్తూ హీరో బాక్సింగ్ స్టిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనే క్యాప్షన్ తో టైటిల్ కి జస్టిఫికేషన్ ఇస్తూ తన స్టైల్ లో పోస్టర్ ని వదిలాడు పూరి జగన్నాథ్. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ తో తను తీస్తున్న ఈ సినిమాకు పూరి ఇలాంటి ఓ డిఫరెంట్ టైటిల్ పెట్టడం సినిమా గురించి మాట్లాడుకునేలా చేస్తుంది.

Vijay Liger First Look

విజయ్ లైగర్ ఫస్ట్ లుక్

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను పూరి జగన్నాథ్ , ఛార్మీ, కరణ్ జోహార్ , అపూర్వ మెహత నిర్మిస్తున్నారు. విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్య కృష్ణ ఓ ముఖ్య పాత్రలో నటిస్తుంది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన షూటింగ్ ను త్వరలోనే పూర్తి చేసే పనిలో ఉన్నాడు పూరి.