నితిన్ డైరెక్టర్ తో రామ్ సినిమా ?

Monday,January 18,2021 - 12:34 by Z_CLU

ప్రస్తుతం Ram డబుల్ రోల్ చేసిన థ్రిల్లర్ సినిమా ‘RED‘ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. అయితే ఇంత వరకూ తన నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది ఎనౌన్స్ చేయలేదు రామ్. తాజా సమాచారం ప్రకారం గతేడాది నితిన్ తో ‘భీష్మ’ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వెంకీ కుడుముల తో రామ్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. ఇటివలే రామ్ ను కలిసి తన స్టైల్ స్క్రిప్ట్ వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట వెంకీ.

 రామ్ నెక్స్ట్ లిస్టులో తమిళ్ డైరెక్టర్ నేసన్ పేరు కూడా ఉంది. రామ్ కి నేసన్ ఓ యాక్షన్ డ్రామా కథ చెప్పి లాక్ చేసుకున్నాడు. మరి రామ్ ముందుగా వెంకీ కుడుముల తో సినిమా చేస్తాడా లేదా నేసన్ కి ఛాన్స్ ఇస్తాడా తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ జనవరి నెలాఖరున రామ్ ఎవరితో సినిమా చేస్తాడనే విషయంపై క్లారిటీ రానుంది.

తమిళ్ డైరెక్టర్ తో రామ్ ?