మా సినిమా సంక్రాంతి వరకు ఆడుతుంది

Tuesday,December 11,2018 - 05:40 by Z_CLU

వరల్డ్ వైడ్ సూపర్ హిట్ అయిన 2.O సినిమా, తెలుగు స్టేట్స్ లో కూడా కళ్లుచెదిరే వసూళ్లతో దూసుకుపోతోంది. విడుదలైన మొదటి రోజు నుంచి హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా సంక్రాంతి వరకు ఆడుతూనే ఉంటుందంటున్నారు, తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేసిన నిర్మాత ఎన్వీ ప్రసాద్. ప్రస్తుతం 2.O సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపిన ఎన్వీ ప్రసాద్, తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు.

రజనీకాంత్, ఎమీ జాక్సన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా చిన్నారుల్ని బాగా ఎట్రాక్ట్ చేస్తోందని, మరీ ముఖ్యంగా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిన గ్రాఫిక్స్ ను త్రీడీలో చూస్తూ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారని అంటున్నారు ఎన్వీ ప్రసాద్

రేపటితో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా 2 వారాలు కంప్లీట్ చేసుకొని, మూడో వారంలోకి ఎంటర్ అవుతుంది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటుచేసిన ఎన్వీ ప్రసాద్, సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు, సపోర్ట్ అందించిన మీడియాకు థ్యాంక్స్ చెప్పారు.