రవితేజ, వీఐ ఆనంద్ సినిమాపై క్లారిటీ

Tuesday,December 11,2018 - 04:50 by Z_CLU

రవితేజ, వీఐ ఆనంద్ సినిమాపై ఎప్పటికప్పుడు పుకార్లు వస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా అమర్ అక్బర్ ఆంటోనీ సరైన సక్సెస్ అందుకోలేకపోవడంతో రవితేజ, వీఐ ఆనంద్ సినిమా ఆగిపోయిందంటూ రూమర్స్ వస్తున్నాయి. దీనిపై ఆ సినిమా నిర్మాత స్పందించాడు.

సినిమా ఆగిపోలేదని, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉందని ప్రకటించాడు రామ్ తళ్లూరి. కథ లాక్ అయినా, స్క్రీన్ ప్లే విషయంలో వీఐ ఆనంద్ బాగా కష్టపడుతున్నాడని, అందుకే కాస్త ఆలస్యమౌతోందని ప్రకటించాడు. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వస్తుందంటున్నాడు.

ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ పై రూపొందుతున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, నబా నటేష్, ప్రియాంక జవల్కర్ హీరోయిన్స్ గా ఎంపికయ్యారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.