జీ సినిమాలు ( 12th డిసెంబర్ )

Tuesday,December 11,2018 - 10:03 by Z_CLU

యుగానికి ఒక్కడు

నటీనటులు : కార్తీరీమా సేన్ , ఆండ్రియా

మ్యూజిక్ డైరెక్టర్ : జి.వి.ప్రకాష్ కుమార్

డైరెక్టర్ : సెల్వ రాఘవన్

ప్రొడ్యూసర్ : ఆర్.రవీంద్రన్

విడుదల జనవరి 14 , 2010

కార్తీరీమా సేన్ఆండ్రియా లతో దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన ఎడ్వెంచర్ఎంటర్టైనర్ చిత్రం ‘యుగానికొక్కడు’. చోళుల సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలనుకొనే ఓఅమ్మాయి  ఇద్దరి సహాయం తో  స్థలాన్ని చివరికీ ఎలా కనిపెట్టింది అనే కధాంశం తోతెరకెక్కిన  చిత్రం లో చోళుల సామ్రాజ్యానికి ప్రయాణించే సీన్స్చోళుల సామ్రాజ్యం లోకిప్రవేశించే సీన్స్ప్రవేశించిన తరువాత థ్రిల్లింగ్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణలు.  చిత్రం లోకార్తీ నటనరీమా సేన్ఆండ్రియా గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్స్.

==============================================================================

ప్రేమించుకుందాం రా

నటీనటులు : వెంకటేష్, అంజలా జవేరి

ఇతర నటీనటులు : జయ ప్రకాష్ రెడ్డి, శ్రీహరి, చంద్ర మోహన్, ఆహుతి ప్రసాద్, పరుచూరి వెంకటేశ్వర రావు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : జయంత్.సి.పనార్జీ

ప్రొడ్యూసర్ : D.సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 9 మే 1997

తెలుగు తెరపై మొట్ట మొదటిసారిగా ఫ్యాక్షనిజం పై తెరకెక్కిన అద్భుత ప్రేమ కథా చిత్రం ప్రేమించుకుందాం రా’. వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించిన ఈ సినిమా రిలీజిన్ అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ టాక్ తో ప్రదర్శించబడింది. తన ప్రేమకు వ్యతిరేకంగా ఉన్న పెద్ద్లలను ఎదిరించి ఎలా ఒక్కటయ్యారు  అన్నదే కథ. పర్ ఫెక్ట్ యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్.

==============================================================================

వసంతం  

నటీనటులు : వెంకటేష్ఆర్తి అగర్వాల్కళ్యాణి

ఇతర నటీనటులు : V.V.S. లక్ష్మణ్ఆకాష్సునీల్చంద్ర మోహన్తనికెళ్ళ భరణిధర్మవరపు సుబ్రహ్మణ్యం మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్

డైరెక్టర్ : విక్రమన్

ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్

రిలీజ్ డేట్ : 11 జూలై 2003

స్నేహానికిప్రేమకు మధ్య డిఫెరెన్స్ ని అద్భుతంగా ఎలివేట్ చేసిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వసంతం. ఎంత పెద్ద త్యాగానికైనా వెనకాడని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కథే ఈ సినిమా. ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలుస్తాయి.

==============================================================================

త్రిపుర

నటీనటులు : స్వాతి రెడ్డినవీన్ చంద్ర

ఇతర నటీనటులు రావు రమేష్సప్తగిరిశివన్నారాయణ నడిపెద్దిజయ ప్రకాష్ రెడ్డిప్రీతీ నిగమ్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కామ్రాన్

డైరెక్టర్ : రాజ్ కిరణ్

ప్రొడ్యూసర్స్ : A. చినబాబు & రాజశేఖర్

రిలీజ్ డేట్ : 6 నవంబర్ 2015

స్వాతి లీడ్ రోల్ ప్లే చేసిన త్రిపుర పర్ఫెక్ట్ ఇమోషనల్ హారర్ థ్రిల్లర్. పల్లెటూరిలో పెరిగిన త్రిపురకు చిన్నప్పటి నుండి తన చుట్టూ పక్కల జరగబోయే ఇన్సిడెంట్స్ గురించి కలలు వస్తుంటాయి. అవి కాస్తా నిజమవుతుంటాయి. దాంతో త్రిపురకు ట్రీట్ మెంట్ కోసమని సిటీకి తీసుకువస్తారు. అక్కడ నవీన్ చంద్రత్రిపురలు ప్రేమలో పడతారుపెళ్ళి కూడా చేసేసుకుంటారు.  తరవాత ఏం జరుగుతుందనేదే సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

దమ్ము

నటీనటులు : N.T.R, త్రిష కృష్ణన్, కార్తీక నాయర్

ఇతర నటీనటులు : వేణు తొట్టెంపూడి, అభినయ, భానుప్రియ, నాజర్, సుమన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, సంపత్ రాజ్, కిషోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి

డైరెక్టర్ : బోయపాటి శ్రీను

ప్రొడ్యూసర్ : అలెగ్జాండర్ వల్లభ

రిలీజ్ డేట్ : 27 ఏప్రియల్ 2012

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ దమ్ము. N.T.R స్టామినా పర్ ఫెక్ట్ గా ఎలివేట్ అయిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించాడు. యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

భీమవరం బుల్లోడు

నటీనటులు : సునీల్ఎస్తర్ నోరోన్హా

ఇతర నటీనటులు : విక్రమ్ జీత్ విర్క్సాయాజీ షిండేరఘుబాబుసుబ్బరాజుసత్య రాజేష్తెలంగాణ శకుంతల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : ఉదయ్ శంకర్

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 27 ఫిబ్రవరి 2014

తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉండటంతో ఇంకా ఎన్నో రోజులు బ్రతకనని తెలుసుకున్న రాంబాబుఆ మిగిలిన కొన్ని రోజులు సొసైటీలో చేంజ్ తీసుకురావడం  కోసం స్పెండ్ చేయాలనుకుంటాడు. అల్టిమేట్ గా తన చుట్టూరా జరుగుతున్న రౌడీయిజాన్ని అంతం చేయాలనుకుంటాడు. ఈ ప్రాసెస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాడు. తీరా కొన్ని రోజుల తరవాత తన ప్రాణాలకు ఏ ఆపద లేదనిఅసలు తనకు బ్రెయిన్ ట్యూమరే లేదని తెలుస్తుంది రాంబాబుకి. ఆ తర్వాత రాంబాబు ఏం చేస్తాడు..మళ్ళీ మునుపటిలాగే సాధారణంగా బ్రతికేస్తాడా..సొసైటీ కోసం తను చేసే పోరాటాన్ని కంటిన్యూ చేస్తాడా..అనేదే సినిమాలోని ప్రధాన కథాంశం.