డెబ్యూ డైరెక్టర్ కి అదిరిపోయే గిఫ్ట్

Saturday,August 11,2018 - 12:48 by Z_CLU

సినిమా అనుకున్న రేంజ్ కంటే పెద్ద హిట్ అయితే ఆ సినిమా హీరో దర్శకుడికి ఓ కారు గిఫ్ట్ గా ఇవ్వడం కామనే.. ఇటివలే మహేష్ కూడా కొరటాల కి కారు ను బహుమతిగా అందించాడు. లేటెస్ట్ గా  ఓ డెబ్యూ డైరెక్టర్ కి ఓ జీపు (కారు)ను బహుమతిగా ఇచ్చాడు నిర్మాత.

ఇటివలే వచ్చిన ‘ఆర్.ఎక్స్ 100’ ఎంతటి సెన్సేషనల్ హిట్ సాధించిందో తెలిసిందే…  10 కోట్లకు పైగా షేర్ అలాగే 20 కోట్ల గ్రాస్ సాదించి చిన్న సినిమాల్లో పెద్ద విజయం అందుకుంది ఈ సినిమా. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అజయ్ కి జీప్ కారును బహుమతి ఇచ్చాడు నిర్మాత అశోక్.

డెబ్యూ సినిమాతో ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు  అజయ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసాడు. తనకు జీప్ బహుమతిగా ఇచ్చిన నిర్మాతకి థాంక్స్ చెప్తూ కార్ పక్కన నిల్చున్న ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి .