రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'ఈ మాయ పేరేమిటో'

Saturday,August 11,2018 - 01:52 by Z_CLU

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ గా ఉన్న విజ‌య్  తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఈ మాయ పేరేమిటో’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ 24 న విడుదల కానుంది. లేటెస్ట్ గా పోస్టర్ తో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు మేకర్స్.

వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్‌ బేనర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు రాము కొప్పుల దర్శకుడు. దివ్య విజయ్‌ నిర్మాత.   ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో పాటు ల‌వ్‌, కామెడీ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో రాహుల్ విజయ్ సరసన కావ్య థాప‌ర్ హీరోయిన్ గా నటిస్తుంది. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.