ఆగస్ట్ 23న "ప్రేమకు రెయిన్ చెక్"
Saturday,August 11,2018 - 11:40 by Z_CLU
శరత్ మరార్ – నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సంస్థ సమర్పణ లో స్టోన్ మీడియా ఫిలిమ్స్ ప్రొడక్షన్ ‘ప్రేమకు రెయిన్ చెక్ ‘ రిలీజ్ కి రెడీ అయింది. కొత్త తారాగణంతో నూతన దర్శకులు ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్ట్ 23 న రిలీజ్ కి రెడి అయింది.
‘ప్రేమకు రెయిన్ చెక్’ టైటిల్ నుంచే కొత్తధదాన్ని ప్రేక్షకులకి అందించిన చిత్ర బృందం ఈ రోజు విడుదల చేసిన ట్రైలర్ తో అంచనాలని పెంచేసింది. ప్రస్తుత యువత (మిల్లెనిఅల్స్) ని దృష్టి లో ఉంచుకొని ఈ కథ చెప్పే ప్రయత్నం చేసామని దర్శకులు ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ తెలిపారు.
ఈ చిత్రం లో ఒక వ్యక్తి తన ప్రేమకు రెయిన్ చెక్ ఇచ్చి కెరీర్ కి ప్రాముఖ్యత ఇచ్చి తన జీవితాన్ని ఎలా కంప్లికేట్ చేసాడు అన్న కథతో రూపొందిన ఈ సినిమా నేటి యువతను ఆకర్షిస్థాయని నిర్మాత తెలిపారు.