ప్రియాంక జవాల్కర్ ఇంటర్వ్యూ

Tuesday,November 13,2018 - 04:03 by Z_CLU

‘టాక్సీవాలా’ లో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది ప్రియాంక జవాల్కర్. ఈ నెల 17 న రిలీజవుతున్న ఈ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ప్రియాంక, ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకుంది.

పక్కా తెలుగమ్మాయి…

మాది అనంతపూర్. బేసిగ్గా మరాఠీ ఫ్యామిలీ, అయినా తెలుగు నేర్చుకున్నాను.

అలా జరిగింది…

2016 లో భిక్షు గారి దగ్గర యాక్టింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. 4 నెలల ట్రైనింగ్ తరవాత గీతా ఆర్ట్స్ కి నా ఫోటోస్ పంపించాను. ఆడిషన్ తర్వాత, పర్టికులర్ గా ‘టాక్సీవాలా’ సినిమాకి అని చెప్పలేదు కానీ, ఇప్పుడు చేయబోయే సినిమాల్లో దేనికి మ్యాచ్ అయితే, అందులో తీసుకుంటాం అని చెప్పారు…

షార్ట్ ఫిలిమ్స్ చేశా..

5 ఇయర్స్ బ్యాక్ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశా. అక్కణ్ణించే నా యాక్టింగ్ కరియర్ బిగిన్ అయింది.

అదీ నేను…

నేను కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ ని. ఆ తరవాత హైదరాబాద్ కి వచ్చి నిఫ్ట్ లో ఫ్యాషన్ క్లాతింగ్ అండ్ టెక్నాలజీ డిప్లొమా చేశా. ఈ కోర్స్ చేసే టైమ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేశా.

అదే నా ఫీలింగ్…

సినిమాలో ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు దానికి ఎవరు సూట్ అవుతారో అబివియస్ గా వాళ్ళకే అవకాశం వస్తుంది. ఇక తెలుగమ్మాయిల విషయానికి వస్తే, ఇంకా చాలా మంది ఇండస్ట్రీకి వస్తే బావుంటుంది.

అసలు నేనే నమ్మలేదు…

టాక్సీవాలా చాన్స్ వచ్చిన తరవాత కూడా ఇంట్లో చెప్పలేదు. ఇంత గొప్ప ఆఫర్, అందరికీ చెప్పుకున్నాక మధ్యలో నేను నచ్చక తీసేస్తే, మళ్ళీ బావుండదు అని. కొన్ని రోజుల తరవాత, ఇంకా నన్ను తీసేయరు అని నమ్మకం కుదిరాక చెప్పా…

రిలీజ్ కోసమే వెయిటింగ్…

టాక్సీవాలా గ్రాఫిక్ వర్క్ కే ఎక్కువ టైమ్ పట్టింది. ఈ సినిమా చేసేటప్పుడు కూడా చాలా ఆఫర్స్ వచ్చాయి కానీ, ఈ సినిమా రిలీజయ్యాకే వేరే ఆఫర్స్ గురించి ఆలోచిద్దామనుకున్నా.. ఢెఫ్ఫినేట్ గా ‘టాక్సీవాలా’ ఆఫ్టర్ రిలీజ్ ఇంపాక్ట్ ఇంకోలా ఉంటుంది. నాకా నమ్మకం ఉంది.

సినిమాలో నా క్యారెక్టర్..

సినిమాలో నా పేరు అనూ. జూనియర్ డాక్టర్ లా నటించాను. హీరో క్యాబ్ డ్రైవర్ కాబట్టి క్యాబ్ లో పరిచయం, అక్కణ్ణించి హీరోతో పాటు స్టోరీలో ట్రావెల్ ఉంటుంది…

బన్నితో ఒకసారి…

టాక్సీవాలా’ చేసేటప్పుడు బన్నిని ఒకసారి కలిసే చాన్స్ దొరికింది. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నా గురించి మాట్లాడినప్పుడు చాలా హ్యాప్పీగా అనిపించింది.

దర్శకుడు రాహుల్…

పక్కా పర్ఫెక్షనిస్ట్. ప్రతీది ఆయనకు పర్ఫెక్ట్ గా కావాలి. చాలా ఓపిగ్గా ఒకటికి రెండు సార్లు చెప్పి చేయించుకున్నారు ఎంత ప్రెజర్ లో కూడా టెంపర్ లూజ్ అవ్వరు. స్క్రిప్ట్ కూడా ఒకరోజు ముందే ఇచ్చేసేవారు.