Interview - ప్రియాంక జవాల్కర్ (SR కళ్యాణమండపం, తిమ్మరుసు)

Wednesday,August 11,2021 - 07:53 by Z_CLU

కెరీర్ ఆరంభంలోనే హీరోయిన్ గా హ్యాట్రిక్ హిట్ సొంతం చేసుకుంది ప్రియాంక జవాల్కర్. అంతే కాదు ఒకే నెలలో రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘తిమ్మరుసు’, ‘SR కళ్యాణమండపం’ సినిమాలతో థియేటర్స్ లో సందడి చేస్తున్న తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్ మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు ప్రియాంక మాటల్లోనే…

గ్యాప్ వచ్చింది .. కానీ

ట్యాక్సీ వాలా హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవ్వడం లక్కీ అనుకుంటున్నాను. ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో నాకు హీరోయిన్ గా మంచి ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఆ సినిమా తర్వాత దాదాపు 25కథలు విన్నాను. వాటిలో తిమ్మరుసు . SR కళ్యాణ మండపం నన్ను ఎగ్జయిట్ చేశాయి. వెంటనే సినిమాలు చేసేయ్యాలి అనుకోకుండా మంచి సినిమాలు చేయాలి డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి అనుకుంటున్నాను. అందుకే ఇంత గ్యాప్ వచ్చింది.

Priyanka Jawalkar
బరువు తగ్గడం చాలా కష్టం

ఆరోగ్య సమస్యల వల్ల బాగా బరువు పెరిగాను. తర్వాత మళ్ళీ వర్కౌట్స్, ఫుడ్ డైట్ చేసి తగ్గాను. బరువు తగ్గడం చాలా కష్టమైన పని. మన బాడీ మీద పూర్తి శ్రద్ధ పెట్టి మేంటైన్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్ గా తిమ్మరుసు చూసి కొందరు నా ఫిజిక్ మీద ఫోకస్ చేయమని అన్నారు. నా మీద నాకు ఫోకస్ ఉండదా? వాళ్ళు చెప్తేనే తెలుసుకుంటానా? అనిపించింది. అందుకే సక్సెస్ మీట్ లో అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది.

ఒకేసారి రెండు సినిమాలు.. అదొక కిక్

నేను హీరోయిన్ గా నటించిన ‘తిమ్మరుసు’ , SR కళ్యాణమండపం రెండు సినిమాలు ఒకే టైం లో రిలీజ్ అయ్యాయి. రిలీజ్ కి ముందు చాలా టెన్షన్ పడ్డాను. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ? అసలు థియేటర్స్ కి జనాలు వస్తారా ? అనే డౌట్స్ ఉన్నాయి. కానీ రెండు సినిమాలు మంచి హిట్ అయ్యాయి. సో హ్యాపీ గా ఫీలవుతున్నాను. నా రెండు సినిమాలు పక్క పక్కనే థియేటర్స్ లో ఆడటం మంచి కిక్ ఇచ్చింది. ఇది నాకు బెస్ట్ మూమెంట్ అనిపిస్తుంది.

Priyanka Jawalkar
ఆ ముగ్గురిలో అది కామన్

ఇప్పటి వరకు నేను విజయ్ దేవరకొండ , సత్య దేవ్ , కిరణ్ అబ్బవరం ముగ్గురితో నటించాను. ఈ ముగ్గురిలో తపన అనేది కామన్ పాయింట్. మంచి సినిమా ఇవ్వాలి. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది. అది గమనించాను.

హ్యాట్రిక్ హిట్ … వెరీ హ్యాపీ

హీరోయిన్ గా చేసిన మూడు సినిమాలు హిట్ అవ్వడం నా అదృష్టం అనుకుంటున్నా. జెనరల్ గా కెరీర్ స్టార్టింగ్ లో అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. కానీ నాకన్నీ అప్స్ ఉన్నాయి.

Priyanka Jawalkar
‘గమనం’ అలాంటి సినిమానే

ప్రస్తుతం హీరోయిన్ గా గమనం అనే సినిమా చెస్తున్నాను. ప్రతీ యాక్టర్ కి ఛాలెంజింగ్ క్యారెక్టర్ , మంచి స్క్రిప్ట్ తో సినిమాలు చేయాలని ఉంటుంది. గమనం నాకు అలాంటి సినిమానే . సినిమాలో నా క్యారెక్టర్ చిన్నదే. కానీ బాగా నచ్చి చేశాను. ప్రస్తుతం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే ఆ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తాను.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics