ఘనంగా ప్రియాంక చోప్రా పెళ్ళి – డేట్స్ ఫిక్స్

Wednesday,October 17,2018 - 01:07 by Z_CLU

ప్రియాంక చోప్రా, నిక్ జోన్స్ ల పెళ్లి డేట్ ఫిక్సయింది. ఆగష్టు 18 న ముంబై లో ఎంగేజ్ మెంట్ జరుపుకున్న ఈ లవ్ కపుల్, త్వరలో అఫీషియల్ గా ఒక్కటి కాబోతున్నారు. రీసెంట్ గా రాజస్థాన్ లోని జోధ్ పూర్ లో తమ పెళ్లి వెన్యూ ని ఫిక్స్ చేసుకున్న ఈ జంట నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు పెళ్ళి వేడుకలు గ్రాండ్ గా జరుపుకోనున్నారు.

వెడ్డింగ్ డేట్ నాటికీ ఇప్పటికే కమిట్ అయి ఉన్న సినిమాలను ఫినిష్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్న ప్రియాంక చోప్రా, రీసెంట్ గా ‘ద స్కై ఈజ్ పింక్’ సినిమాను కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాలో ఫర్హాన్ అఖ్తర్ సరసన జైరా వసీమ్ కి తల్లిగా నటిస్తుంది. ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఆయేషా చౌదరి లైఫ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కంప్లీట్ గా డిఫెరెంట్ రోల్ లో కనిపించనుంది ప్రియాంక చోప్రా.

ఈ సినిమాతో పాటు హాలీవుడ్ సినిమాల షెడ్యూల్స్ ని కూడా పక్కాగా ప్లాన్ చేసుకున్న ప్రియాంక చోప్రా, వెడ్డింగ్ డేట్ కి మినిమం వారం రోజులు ముందుగానే, ఇండియాకి రానుంది. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ కరియర్ పై ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్న ప్రియాంక చోప్రా, మ్యాగ్జిమం లాస్ ఏంజిల్స్ లేదా న్యూయార్క్ లోనే సెటిల్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని గెస్ చేస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.