వచ్చే నెలలో ప్రియాంక చోప్రా ఎంగేజ్ మెంట్

Friday,June 29,2018 - 10:03 by Z_CLU

మ్యాగ్జిమం జూలై లేదా ఆగష్టు కల్లా పెళ్ళి చేసుకోబోతుంది- ఇది B టౌన్ లో స్ట్రాంగ్ గా వినిపిస్తున్న టాక్. ఈ విషయంలో ప్రియాంక చోప్రా కానీ, తన కుటుంబ సభ్యులు కానీ అఫీషియల్ గా ఎటువంటి అనౌన్స్ మెంట్ అయితే చేయలేదు కానీ, రీసెంట్ గా నిక్ జోన్స్ తో గోవా వెకేషన్ కి వెళ్ళిన ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో, ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ బిగిన్ అయ్యాయి.

రీసెంట్ గా నిక్ జోన్స్ కూడా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ప్రియాంక చోప్రా వీడియో పోస్ట్ చేయడంతో ఆల్మోస్ట్ వీళ్ళిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని కన్ఫం చేసుకున్న ఫ్యాన్స్, ఇప్పడు ఆల్రెడీ వీళ్ళిద్దరూ పెళ్ళి పనులు బిగిన్ చేసేశారని, మ్యాగ్జిమం జూలై, లేదా ఆగష్టు ఎంగేజ్ మెంట్ చేసుకోవడం ఖాయమని గెస్ చేస్తున్నారు.

 

క్వాంటికో షోతో వరల్డ్ పాప్యులర్ స్టార్ అనిపించుకున్న ప్రియాంక చోప్రా, మరి పబ్లిక్ గా అనౌన్స్ చేసి పెళ్ళి చేసుకుంటుందా..? లేకపోతే సీక్రెట్ గా పెళ్ళి కానిచ్చి తరవాత అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుందా అనేది ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది.