బ్యాట్ పట్టిన అర్జున్.. నాని కొత్త సినిమా లాంచ్

Wednesday,October 17,2018 - 12:10 by Z_CLU

నాని కొత్త సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో లాంఛ్ అయింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఆఫీస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్ పాల్గొన్నాడు. సినిమాకు క్లాప్ కొట్టాడు. రేపట్నుంచి మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

మళ్లీ రావా సినిమాతో దర్శకుడిగా మారిన గౌతమ్ తిన్ననూరి, తన రెండో ప్రయత్నంగా నానితో కలిసి జెర్సీ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. అజ్ఞాతవాసి సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన అనిరుధ్, జెర్సీకి సంగీత దర్శకుడు.

క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది జెర్సీ సినిమా. లేటు వయసులో క్రికెటర్ గా మారిన అర్జున్ పాత్రలో నాని కనిపించబోతున్నాడు. సత్యరాజ్ ఈ సినిమాలో నానికి కోచ్ గా కనిపించబోతున్నాడు. ఈ మూవీ కోసం దాదాపు నెల రోజులుగా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు నాని.