సాంగ్ తో ట్రెండింగ్ లో నిలిచిన ప్రదీప్ !

Monday,February 03,2020 - 03:57 by Z_CLU

బుల్లితెరపై స్టార్ అయినా సరే చివరి టార్గెట్ మాత్రం సినిమానే. అందుకే అవకాశం వస్తే వెండితెరపై కూడా మెరవాలని చూస్తుంటారు. ఇప్పుడు స్టార్ యాంకర్ ప్రదీప్ కూడా తన యాక్టింగ్ స్కిల్స్ తో త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీద మేజిక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. మున్నా డైరెక్షన్ లో తెరకెక్కిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా పరిచయమవుతున్నాడు ప్రదీప్.

ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ గా రిలీజయిన ‘నీలి నీలి ఆకాశం’ అనే సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్ లో మొదటి స్థానంలో కొనసాగుతుంది. అనూప్ అందించిన సాఫ్ట్ ట్యూన్ కి చంద్రబోస్ అందించిన లిరిక్స్ సాంగ్ కి ప్లస్ అయ్యాయి.  సిద్ శ్రీరాం ఈ పాటను పాడటంతో సాంగ్ ఇలా రిలీజయిందో లేదో వెంటనే అందరికీ కనెక్ట్ అయిపొయింది.

ఇప్పటికే సాంగ్ 5 మిలియన్స్ దాటేసి దూసుకెళ్తుంది. ప్రెజెంట్ ఈ సాంగ్ కి వస్తున్న రెస్పాన్స్ తో అతి త్వరలోనే సినిమా నుండి రెండో సాంగ్ ని రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది.