ప్రభుదేవా హల్ చల్...

Monday,October 24,2016 - 03:02 by Z_CLU

దశాబ్దాలుగా ప్రభుదేవాకు, మెగా కాంపౌండ్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. చిరంజీవి సినిమాలకు కేవలం కొరియోగ్రఫీ అందించడానికి మాత్రమే పరిమితం కాలేదు ప్రభుదేవా. మెగాస్టార్ ను హీరోగా పెట్టి, శంకర్ దాదా జిందాబాద్ అనే సినిమాను కూడా డైరక్ట్ చేశారు. అయితే ఈమధ్య కాలంలో బాలీవుడ్ కే ప్రయారిటీ ఇవ్వడంతో… తెలుగు పరిశ్రమకు దూరమైపోయాడు ఈ కొరియోగ్రాఫర్ కమ్ డైరక్టర్. మళ్లీ ఇన్నేళ్లకు ప్రభుదేవా కన్ను టాలీవుడ్ పై పడింది. మరీ ముఖ్యంగా మెగా కాంపౌండ్ పై ఫోకస్ పెట్టారు ప్రభుదేవా. కుదిరితే ఒక మెగా హీరోతో తెలుగులో ఓ సినిమా చేయాలనుకుంటున్నారు.

chiranjeevi-prabhudeva

   రీసెంట్ గా అభినేత్రితో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించిన ప్రభుదేవా…. త్వరలోనే మెగా ఫోన్ పట్టుకొని మెగాహీరోల్లో ఒకరితో సినిమా చేయాలని భావిస్తున్నారట. ఈ మేరకు ఇప్పటికే కొన్ని కథల్ని వినిపించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభుదేవా దర్శకత్వంలో నటించబోయే హీరో ఎవరు…? అది స్ట్రయిట్ సినిమానా, లేక రీమేక్ మూవీనా…?  అనే విషయాలపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.