దూసుకుపోతున్న ప్రిన్స్

Monday,October 24,2016 - 03:08 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ దర్శకత్వం లో నటిస్తున్న తాజా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న యూనిట్ మరో షెడ్యూల్ కి రెడీ అవుతుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నవంబర్ 1 నుంచి మరో షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. దాదాపు నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం మూడు భాషల్లో ఒకే టైటిల్ ను ఖరారు చేశారని టాక్. ఆ టైటిల్ ను దీపావళి రోజున ఎనౌన్స్ చేయాలని అనుకుంటున్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్.జె.సూర్య ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు.