'బలం' చూపించబోతున్నాడు...

Monday,October 24,2016 - 01:35 by Z_CLU

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ టాలీవుడ్ లో తన ‘బలం’ చూపించడానికి రెడీ అవుతున్నాడు. గతంలో క్రిష్, క్రిష్ 3, కోయి మిల్ గయా, కహో నా ప్యార్ హై వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన హృతిక్ రోషన్ మరియు రాకేష్ రోషన్ కాంబినేషన్ లో వస్తోన్న లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ “కాబిల్”.

    ఈ చిత్రాన్ని తెలుగులో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రానికి తెలుగు లో “బలం” అనే టైటిల్ ను ఖరారు చేశారు. దీపావళి కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు ట్రైలర్ ను విడుదల చేసి. ప్రపంచవ్యాప్తం గా జనవరి 26 న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.