Allu Airish Anu Emmanuel - త్వరలోనే కొత్త సినిమా ప్రకటన

Thursday,May 27,2021 - 02:54 by Z_CLU

అల్లు శిరీష్, అను ఇమానుయెల్ జంట‌గా GA2పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో మే 30న‌ అల్లు శిరీష్ ప్రొడ‌క్ష‌న్ నెం 6 ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

కొత్త జంట‌, శీర‌స్తు శుభ‌ంస్తు, ఏబిసిడి వంటి సూప‌ర్ హిట్ సినిమాల‌తో ఒక్క క్ష‌ణం వంటి వినూత‌్నమైన సినిమాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అల్లు శిరీష్, ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో శిరీష్ కి జంట‌గా మ‌ల్లూ బ్యూటీ అను ఇమానుయెల్ న‌టిస్తోంది.

మెగాప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో 100% ల‌వ్, భలే భ‌లే మ‌గాడివోయ్, గీత‌గోవిందం, ప్ర‌తిరోజూపండుగే వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌కు కేర్ ఆఫ్ అడ్ర‌స్ గా మారిన నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ మీద ఈ సినిమా సిద్ధ‌మౌతుంది. మే30 అల్లు శిరీష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఉద‌యం 11 గంట‌ల‌కు ఈ కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్ ను విడుద‌ల చేయ‌నున్నాను.

Allu Airish Anu Emmanuel New Movie zeecinemalu

ఈ వివ‌రాల‌ను తెలుపుతూ విడుద‌ల చేసిన ప్రీ లుక్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అల్లు శిరీష్, అనుఇమానుయెల్ మధ్య న‌డిచే రొమాన్స్ నేప‌థ్యంలో ఓ పోయేటిక్ స్టిల్ తో ఈ ప్రీ లుక్ ని సిద్ధం చేసి విడుద‌ల చేశారు. దీంతో ప్రీలుక్ తో ఈ సినిమా పై అంతటా ఆస‌క్తి నెల‌కొంది. ఇక ఈ సినిమాకు ద‌ర్శ‌కుడెవ‌రు, మ్యూజిక్, సాంకేతిక నిపుణ‌ల‌తో పాటు కీల‌క వివ‌రాల్ని త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల చేయ‌నున్నారు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics