గ్రాండ్ గా రిలీజ్ కానున్న ఆచారి అమెరికా యాత్ర

Wednesday,April 11,2018 - 03:36 by Z_CLU

మంచు విష్ణు హీరోగా నటించిన హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘ఆచారి అమెరికా యాత్ర’. G. నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 27 న రిలీజవుతుంది. అమెరికా, మలేషియా లాంటి ఎగ్జోటిక్ లొకేషన్ లలో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది.

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం ఫుల్ లెంత్ రోల్ ప్లే చేశాడు.   దేనికైనా రెడీ, ఈడోరకం – ఆడోరకం లాంటి హిలేరియస్ ఎంటర్ టైనర్స్ తరవాత మంచు విష్ణు, నాగేశ్వర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా అన్ని క్యాటగిరీస్ ని ఇంప్రెస్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.

 

ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని కీర్తి చౌదరి మరియు కిట్టు ‘పద్మజ పిక్చర్స్’ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమాకి S.S. తమన్ మ్యూజిక్ డైరెక్టర్.