నా పేరు సూర్య 2 రోజుల వసూళ్లు

Sunday,May 06,2018 - 12:44 by Z_CLU

ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన నా పేరు సూర్య సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఈ మూవీని ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బన్నీ మేకోవర్, అతడి డాన్స్, యాక్టింగ్ కు అంతా ఫిదా అయిపోయారు. అలా ఫస్ట్ డే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన నా పేరు సూర్య సినిమా రెండో రోజు కూడా అదే హవాను కొనసాగించింది.

వరల్డ్ వైడ్ ఈ సినిమాకు 2 రోజుల్లో 63 కోట్ల 86 లక్షల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు తొలి 2 రోజుల్లో 21 కోట్ల 55 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

నా పేరు సూర్య 2 రోజుల షేర్

నైజాం – రూ. 6.28 కోట్లు
సీడెడ్ – రూ. 3.17 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.82 కోట్లు
ఈస్ట్ – రూ. 2.41 కోట్లు
వెస్ట్ – రూ. 1.76 కోట్లు
గుంటూరు – రూ. 2.84 కోట్లు
కృష్ణా – రూ. 1.43 కోట్లు
నెల్లూరు – రూ. 0.84 కోట్లు

2 రోజుల మొత్తం షేర్ – రూ. 21.55 కోట్లు