ప్రభాస్ మాస్టర్ ప్లాన్ అదిరింది

Thursday,December 10,2020 - 03:21 by Z_CLU

ఇప్పుడు చేస్తున్న ‘Radheshyam’ సినిమా కాకుండా Prabhas చేతిలో మరో మూడు సినిమాలున్నాయి. లాక్ డౌన్ లో కొన్ని స్క్రిప్ట్స్ విని అందులో నాగ్ అశ్విన్ , ఓం రౌత్, ప్రశాంత్ నీల్ సినిమాలను ఫైనల్ చేసుకున్నాడు ప్రభాస్. అయితే నాగ్ అశ్విన్ తో చేయబోయే Prabhas21, ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘Adipurush’ సెట్స్ పైకి రావడానికి ఇంకా టైం పడుతుంది. అందుకే ఈ లోపు మాస్టర్ ప్లాన్ వేసుకొని ఫాస్ట్ గా ఫినిష్ అయ్యే ‘SALAAR’ సినిమాను ముందుకు తీసుకొచ్చాడు రెబల్ స్టార్.

నిజానికి ప్రభాస్ కమిట్ అయిన మూడు సినిమాలు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్. అయితే వీటిలో ప్రశాంత్ నీల్ సినిమా తొందరగానే ఫినిష్ అయ్యే ఓ మాస్ కమర్షియల్ సబ్జెక్ట్. అందుకే రీసెంట్ గా ఇద్దరూ ఈ స్క్రిప్ట్ గురించి డిస్కషన్ చేసుకొని షూటింగ్ సంబంధించి తక్కువ డేస్ తో ప్లానింగ్ చేసుకున్నారు. వచ్చే జనవరి నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. అంతేకాదు.. కాస్టింగ్ కాల్ ఎనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశారు.

ఈ లోపు KGF 2 సినిమా ఫైనల్ షెడ్యుల్ ని ఫినిష్ చేసి ‘సలార్’ సినిమాకు షిఫ్ట్ అవుతాడు ప్రశాంత్. సో ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే ప్రభాస్.. ఆదిపురుష్ సినిమాను మొదలు పెట్టే అవకాశం ఉంది. మరి SALAAR తో రాబోతున్న ఈ క్రేజీ కాంబో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.