అవేవీ నమ్మొద్దంటున్న ప్రభాస్

Tuesday,October 25,2016 - 05:01 by Z_CLU

ప్రభాస్ బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాడా..? బాహుబలి తరవాత ప్రభాస్ కి అటు బాలీవుడ్ లోను విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. అందుకే బాలీవుడ్ లోని బడా నిర్మాతలు ప్రభాస్ కి ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు. బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ సిరీస్ ధూమ్ – 4 లోనూ ప్రభాస్ నటించనున్నాడని రూమర్లు చక్కర్లు కొట్టాయి.

    అయితే ఈ వార్తలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేశాడు ప్రభాస్. బాలీవుడ్ నుండి ఆఫర్స్ వచ్చిన మాట వాస్తవమే అయినా ఇప్పటివరకు ఏ సినిమాకూ సంతకం చేయలేదని చెప్తూనే, బాహుబలి-2 కి ప్యాకప్ చెప్పిందే ఆలస్యం తెలుగులో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి వస్తాయని క్లారిటీ ఇచ్చాడు బాహుబలి. ముంబయిలో జరిగిన బాహుబలి-2 ఫస్ట్ లుక్ లాంఛ్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… ఈ విషయాల్ని బయటపెట్టాడు యంగ్ రెబల్ స్టార్.