మరోసారి తెరపైకి హిందీ రీమేక్..

Tuesday,October 25,2016 - 04:57 by Z_CLU

ఇండియన్ మైకేల్ జాక్సన్ మరోసారి మెగాఫోన్ పట్టుకోనున్నాడు. వాంటెడ్, రౌడీ రాథోడ్, రామయ్యా వస్తావయ్యా తరహాలో మరో తెలుగు సూపర్ హిట్ ని హిందీలో రీమేక్ చేయబోతున్నాడు. రామ్ చరణ్ హీరోగా అప్పట్లో మ్యాగ్జిమం టాలీవుడ్ లో అన్ని రికార్డుల్ని బ్రేక్ చేసిన ‘మగధీర’ ని హిందీలో రీమేక్ చేయబోతున్నాడు ప్రభుదేవా.

    షాహిద్ కపూర్ హీరోగా నటించనున్న హిందీ ‘మగధీర’ ప్రీ ప్రొడక్షన్ ఆల్ రెడీ స్టార్ట్ అయిపోయిందని  సమాచారం. గతంలో ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించనున్నట్టు వార్తలొచ్చాయి. ఆ తర్వాత రణ్వీర్ సింగ్ పేరు కూడా వినిపించింది. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. పైనల్ గా మగధీరుడిగా షాహిద్ కపూర్ సెట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది.