మెరుపు పాత్రలు...

Wednesday,October 26,2016 - 11:33 by Z_CLU

విడుదలకు ముందు అలాంటిదేం లేదంటారు.. రిలీజ్ అయ్యాక మాత్రం గెస్ట్ రోల్స్ తో మెరిపిస్తారు… మూవీకి హైప్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో… విడుదలకు ముందు గెస్ట్ రోల్ చేస్తున్న విషయాన్ని కన్ ఫర్మ్ చేయడం లేదు చాలామంది స్టార్లు.

collage

ఇటీవలే నాగచైతన్య నటించిన ‘ప్రేమమ్’ లో నాగార్జున గెస్ట్ రోల్ చేసినప్పటికీ యూనిట్ మాత్రం నాగ్ కేవలం వాయిస్ మాత్రమే ఇచ్చారని చెప్పుకొచ్చారు. తీరాచూస్తే క్లైమాక్స్ లో చైతూ తండ్రి పాత్రలో కనిపించి ఒక్కసారిగా అభిమానులకు తియ్యటి షాకిచ్చాడు నాగ్. ఇదే సినిమాలో వెంకటేష్ కూడా ఒక గెస్ట్ రోల్ లో కనిపించాడు. నారా రోహిత్, నాగసూర్య కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం ‘జ్యో అచ్యుతానంద’ లో ఓ గెస్ట్ రోల్ కనిపించి షాక్ ఇచ్చాడు నాని.

cherri-raj-tarun

తాజాగా నాని నటించిన ‘మజ్ను’ చిత్రం  క్లైమాక్స్ లో ఓ గెస్ట్ రోల్ తో షాక్ ఇచ్చాడు కుర్ర హీరో రాజ్ తరుణ్. మెగాస్టార్ నటిస్తున్న ‘ఖైదీ నెం 150’ లో ఇలాంటి ఓ షాకింగ్ ఎప్పీయరెన్స్ ఉందట. ఆ గెస్ట్ రోల్ చేయబోయేది మరెవరో కాదు… స్వయంగా మెగా తనయుడు చరణ్ అని తెలుస్తోంది.