పవన్ సరసన పూజా హెగ్డే?

Friday,February 07,2020 - 02:02 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబో ఫిక్స్ అయింది. మూవీ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. కథ ఆల్రెడీ లాక్ అయింది. ఇప్పుడీ సినిమాకు కాస్ట్ & క్రూను ఎంపిక చేసే పనిలో బిజీగా ఉన్నాడు దర్శకుడు. మరీ ముఖ్యంగా హీరోయిన్ ను సెలక్ట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు. ఇందులో భాగంగా పూజా హెగ్డేను మరోసారి రిపీట్ చేయాలనుకుంటున్నాడట ఈ డైరక్టర్.

గబ్బర్ సింగ్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్ తో సినిమా తీయాలని డిసైడ్ అయింది మైత్రీ మూవీ మేకర్స్. అందుకే ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ అనిపించుకుంటున్న పూజా హెగ్డేను తీసుకోవాలని భావిస్తున్నారు.

గతంలో హరీష్ తీసిన డీజే సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. తాజాగా హరీష్ తీసిన గద్దలకొండ గణేష్ సినిమాలో కూడా పూజాహెగ్డే హీరోయిన్. ఆ రెండు సినిమాలూ హిట్టయ్యాయి. ఆ సెంటిమెంట్ తో పవన్ సినిమాకు కూడా పూజా హెగ్డేనే రిపీట్ చేయాలని భావిస్తున్నాడట హరీష్. ప్రస్తుతానికైతే ఇది గాసిప్ లెవెల్లోనే ఉంది. కన్ఫర్మేషన్ కు కాస్త టైమ్ పడుతుంది.