Pawan Harish Movie - ఇంట్రెస్టింగ్ రూమర్!

Thursday,May 20,2021 - 05:13 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -హరీష్ శంకర్ కాంబినేషన్ తెరకెక్కనున్న సినిమాపై ఓ ఆసక్తికరమైన ప్రచారం జరుగుతుంది. సినిమాలో పవన్ కళ్యాణ్ డ్యుయల్ రోల్ చేయనున్నాడని టాక్ వినబడుతుంది. కెరీర్ లో ఓకె ఒక్కసారి తీన్ మార్ సినిమాలో డబుల్ యాక్షన్ చేశాడు పవన్ . ఒక వేళ ఈ ప్రచారం నిజమైతే పవర్ స్టార్ ని డబుల్ రోల్ చూసే రెండో సినిమా అవుతుంది. ప్రస్తుతం సినిమా స్క్రిప్టు కి ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో బిజీ గా ఉన్నాడు హరీష్ శంకర్.

అలాగే సినిమాకు సంబంధించి మేజర్ క్యారెక్టర్స్ కి కాస్టింగ్ ఫైనల్ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నటీ నటులను హరీష్ సంప్రదించాడని సమాచారం. మూవీ మేకర్స్ బేనర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ప్రముఖ ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి ఈ సినిమాకు ఆర్ట్ వర్క్ చేయనున్నారు.

గతంలో పవన్ -హరీష్ కాంబినేషన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఇండస్ట్రీ హిట్ గా నిలిచి వాసుల్ల సునామి సృష్టించింది. ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ కలిసి వర్క్ చేయబోతున్న ఈ కాంబో సినిమాపై ప్రకటన నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాలో పవన్ ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తాడని హింట్ ఇచ్చే ఓ కాన్సెప్ట్ పోస్టర్ ని ఎనౌన్స్ రోజే వదిలాడు హరీష్ శంకర్. ఆ పోస్టర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసి పవన్ తో ఈసారి హరీష్ ఏదో కొత్తగా చేయబోతున్నాడని మాట్లాడుకున్నారు. మరి ఈ సినిమాలో పవన్ డ్యుయల్ రోల్ చేస్తే నిజంగా ఆడియన్స్ కి కొత్త ఎక్స్ పీరియన్స్ ఉంటుంది.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics