మరోసారి పోలీస్ కథతో పవన్?

Monday,August 03,2020 - 02:10 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు పోలీస్ యూనిఫామ్ కొత్తకాదు. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన గబ్బర్ సింగ్ లో పవన్ పోలీస్ గెటప్ లోనే కనిపిస్తాడు. దీంతో పాటు కొమరం పులి, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు కూడా చేశాడు. ఇప్పుడీ హీరో మరోసారి ఖాకీ చొక్కా వేసుకోబోతున్నాడు.

హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు పవన్. ఈ సినిమాలో పవన్, పోలీసాఫీసర్ గా కనిపిస్తాడట. ఓ పవర్ ఫుల్ పోలీస్ కథతోనే పవన్ కోసం హరీష్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు టాక్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా రాబోతోంది.

ప్రస్తుతం పవన్ చేతిలో వకీల్ సాబ్ తో పాటు.. క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఉన్నాయి. ఈ రెండూ ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే హరీశ్ శంకర్ మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ గ్యాప్ లో హరీశ్ శంకర్ సినిమాలో పవన్ క్యారెక్టర్ పై ఓ క్లారిటీ వస్తుందేమో చూడాలి.