బాలీవుడ్ పై బుట్టబొమ్మ ఫోకస్

Sunday,March 22,2020 - 04:20 by Z_CLU

‘అల వైకుంఠపుములో’ సినిమాతో హిట్‌ అందుకున్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే మరో బాలీవుడ్‌ సినిమాలో ఛాన్స్‌ కొట్టేసింది. ఇప్పటికే సల్మాన్‌ఖాన్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం ‘కబీ ఈద్‌ కబీ దివాళీ’లో ఆమె నటిస్తుండగా… తాజాగా అక్షయ్‌ కుమార్‌ హీరోగా ఫర్హాద్ షామ్జీ దర్శకత్వంలో వస్తున్న `బచ్చన్ పాండే` సినిమాలోనూ పూజా హీరోయిన్‌గా సెలక్ట్ చేసినట్టు టాక్.

అయితే ఇందులో మెయిన్ హీరోయిన్‌గా కృతి సనన్ నటిస్తుండగా సెకెండ్ లీడ్ లో పూజాని ఎంపిక చేశారట. ఇటీవల ‘హౌజ్‌ఫుల్‌-4’ చిత్రంలో నటించిన పూజా బాలీవుడ్‌ జనాలను బాగానే అలరించింది. తన అప్ కమింగ్ మూవీస్ తో బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ అనిపించుకోవాలని చూస్తోంది పూజా.

ఇటు తెలుగులో ఆల్రెడీ స్టార్ హీరోయిన్ స్టేటస్ తో కంటిన్యూ అవుతుంది ఈ బుట్టబొమ్మ. ప్రస్తుతం ప్రభాస్‌ సరసన ఓ సినిమా, అఖిల్‌ సరసన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ అనే మరో సినిమా చేస్తోంది.