జీ సినిమాలు (23rd మార్చ్)

Sunday,March 22,2020 - 10:02 by Z_CLU

శివగంగ

నటీనటులు : శ్రీరామ్రాయ్ లక్ష్మి
ఇతర నటీనటులు : సుమన్జాన్ పీటర్శరవణన్శ్రీనివాసన్సింగం పూడి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జాన్ పీటర్
డైరెక్టర్ : V.C. వడివుడియన్
ప్రొడ్యూసర్ జాన్ మ్యాక్స్జోన్స్
రిలీజ్ డేట్ : మార్చి 4, 2016


శ్రీ రామ్రాయ్ లక్ష్మీ నటించిన అల్టిమేట్ హారర్ ఎంటర్ టైనర్ శివగంగ. వడివుడియన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో హారర్ ఎలిమెంట్స్ హైలెట్ గా నిలిచాయి.

__________________________________

 

హలో

నటీనటులు : అఖిల్ అక్కినేనికళ్యాణి ప్రియదర్శన్

ఇతర నటీనటులు : జగపతి బాబురమ్యకృష్ణఅజయ్సత్య కృష్ణన్అనీష్ కురువిల్ల మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : అనూప్ రూబెన్స్

డైరెక్టర్ : విక్రమ్ కుమార్

ప్రొడ్యూసర్ : నాగార్జున అక్కినేని

రిలీజ్ డేట్ : 22 డిసెంబర్ 2017 

చిన్నతనంలో తల్లితండ్రులకు కోల్పోయి అనాధగా ఉన్న శీను(అఖిల్)కి స్నేహితురాలుగా పరిచయం అవుతుంది జున్ను(కల్యాణి). అలా అనుకోకుండా ఒక్కటైన శీనుజున్ను కొన్ని రోజులకే విడిపోతారు. అనాధగా ఉన్న శీనుని ఒకానొక పరిస్థితుల్లో అవినాష్ గా పేరు మార్చి దత్తత తీసుకొని పెంచి పెద్ద చేస్తారు సరోజిని(రమ్యకృష్ణ)- ప్రకాష్(జగపతి బాబు). అలా పెరిగి పెద్దవాడైన అవినాష్ కు 15 ఏళ్ళ తర్వాత తన ప్రియురాలిని కలిసే అవకాశం వస్తుంది. అయితే తన ప్రేయసిని కలవడానికి ఒకే ఒక్క ఆధారమైన ఫోన్ పోగొట్టుకుంటాడు. ఇంతకీ అవినాష్ ఫోన్ దొంగలించింది ఎవరుఅవినాష్ – ప్రియగా పేర్లు మార్చుకున్న వీరిద్దరూ చివరికి ఎలా కలిశారు.. అనేది సినిమా స్టోరీ.

________________________________

శివాజీ

నటీనటులు రజినీకాంత్శ్రియ శరన్

ఇతర నటీనటులు : వివేక్సుమన్రఘువరన్మణివన్నన్వడివుక్కరసికోచిన్ హనీఫా తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్

డైరెక్టర్ : S.శంకర్

ప్రొడ్యూసర్ : M.S. గుహన్, M. శరవణన్

రిలీజ్ డేట్ : 15 జూన్ 2007

ఫారిన్ నుండి దేశం కోసం ఏదైనా చేయాలనే ఆరాటం తో ఇండియాకి వస్తాడు శివాజీ. ప్రజల కోసం ఉచిత విద్యవైద్యం అందించాలనే ఉద్దేశం తో ట్రస్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ శివాజే ఇలా చేయడం వల్ల తన వ్యాపారాలు దెబ్బ తింటాయని భావించిన కొందరు శివాజీని అడ్డుకుంటారు. అప్పుడు శివాజీ వారిని ఎలా ఎదుర్కుంటాడు…తాను అనుకున్న విధంగా సమాజానికి సేవ చేయగలిగాడా..లేదా..అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

__________________________________________

బలుపు

నటీ నటులు : రవితేజశృతి హాసన్
ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్ఆషుతోష్ రాణాఅడివి శేష్సనబ్రహ్మానందం.
మ్యూజిక్ డైరెక్టర్ : S.తమన్
డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని
ప్రొడ్యూసర్ : వరప్రసాద్ పొట్లూరి
రిలీజ్  : 28 జూన్ 2013

రవితేజ కరియర్ లోనే భారీ సూపర్ హిట్ ‘బలుపు’. బ్యాంకులో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసే రవితేజసిటీలో తండ్రితో పాటు కాలం గడుపుతుంటాడు. నిజానికి వారి గతం ఏంటి..వారిద్దరూ నిజంగా తండ్రీ కొడుకు లేనా..అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోనూ సూపర్ హిట్ అయింది.

_____________________________________

మిస్టర్ మజ్ను 

నటీ నటులు : అఖిల్, నిధి అగర్వాల్, నాగబాబు , జయప్రకాష్, రావు రమేష్ , హైపర్ ఆది తదితరులు

నిర్మాణం : శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్ఎల్ పీ

నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్

కథ -స్క్రీన్ ప్లే -దర్శకత్వం: వెంకీ అట్లూరి

విడుదల తేది : 25 జనవరి , 2019

______________________________________

నక్షత్రం

నటీనటులు : సందీప్ కిషన్సాయి ధరమ్ తేజ్ప్రగ్యా జైస్వాల్రెజినా
ఇతర నటీనటులు : తనిష్శ్రియ శరణ్ప్రకాష్ రాజ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్
డైరెక్టర్ : కృష్ణవంశీ
ప్రొడ్యూసర్స్ : K. శ్రీనివాసులు, S. వేణు గోపాల్
రిలీజ్ డేట్ :  4 ఆగష్టు


రామాయణంలో హనుమంతుని పాత్ర ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉంటుందో.. సమాజంలో ‘పోలీస్’ పాత్ర అలాంటిది. పోలీస్ అంటే హనుమంతుడు అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కింది నక్షత్రం. పోలీస్ అవ్వాలనే ప్రయత్నంలో వున్న ఓ యువకుడి కథే ఈ ‘నక్షత్రం’. అతడ్ని పోలీస్ కాకుండా అడ్డుకున్నది ఎవరు.. చివరికి సందీప్ కిషన్ పోలీస్ అయ్యాడా లేదా అనేది స్టోరీ. ఈ బేసిక్ ప్లాట్ కు లవ్రొమాన్స్సెంటిమెంట్ ను యాడ్ చేశాడు దర్శకుడు కృష్ణవంశీ. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ స్పెషల్ రోల్ ప్లే చేశాడు.