Pawan Bheemla Nayak - కొత్త రిలీజ్ డేట్

Tuesday,December 21,2021 - 01:11 by Z_CLU

Pawan’s Bheemla Nayak Releases on February 25th

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లానాయక్ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. నిన్నటివరకు ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేస్తామంటూ నిర్మాతలు ప్రకటించారు. ఇప్పుడు కొత్త తేదీ లాక్ చేశారు. శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25న భీమ్లానాయక్ థియేటర్లలోకి వస్తుంది. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున దిల్ రాజు స్వయంగా ప్రకటించారు.

“తెలుగు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తోంది. ఆ స్థాయిని ఇంకా పెంచాలి. దీనికితోడు తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్ సినిమాలకు స్క్రీన్స్ సర్దుబాటు చేసే పరిస్థితి లేదు. ఈ 2 అంశాలపై నిర్మాత రాధాకృష్ణ, హీరో పవన్ కల్యాణ్ తో మా గిల్డ్ సభ్యులం చర్చించాం. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ సినిమాలు పాన్ ఇండియా సినిమాలు. పైగా రెండున్నరేళ్లుగా షూట్ లో ఉన్నాయి. వాటిని వాయిదా వేయలేం. సో.. భీమ్లానాయక్ రిలీజ్ డేట్ ను పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఫిబ్రవరి 25న రిలీజ్ అవుతుంది.”

bheemla nayak February 25 release

గిల్డ్ కు సహకరించినందుకు పవన్ కల్యాణ్ కు థ్యాంక్స్ చెప్పారు గిల్డ్ సభ్యులు. భీమ్లానాయక్ కోసం తన సొంత సినిమా ఎఫ్3ను పోస్ట్ పోన్ చేసుకున్నానని దిల్ రాజు ప్రకటించారు. మరోవైపు నిర్మాత నాగవంశీ కూడా భీమ్లానాయక్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. సినిమాను వాయిదా వేసినందుకు ఫ్యాన్స్ కు సారీ చెప్పారు.

bheemla

సో.. ఇన్నాళ్లుగా సంక్రాంతి రిలీజెస్ పై ఉన్న కన్ఫ్యూజన్ ఎట్టకేలకు క్లియర్ అయింది. ఈ సంక్రాంతికి ప్రస్తుతానికి రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ మాత్రమే బరిలో నిలిచాయి. రాధేశ్యామ్ సినిమా జనవరి 14న, ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న థియేటర్లలోకి వస్తున్నాయి.