F3 Movie - సమ్మర్ సోగ్గాళ్లు రెడీ

Tuesday,December 21,2021 - 01:03 by Z_CLU

F3 Movie Releases on April 29

వెంకటేశ్, వరుణ్ తేజ్ సమ్మర్ సోగ్గాళ్లుగా మారారు. వచ్చే ఏడాది సమ్మర్ లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్నారు. ఈ మేరకు కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. ఏప్రిల్ 29న ఎఫ్3 (F3 Movie) థియేటర్లలోకి రానుంది.

సంక్రాంతికి వస్తుందనుకున్న భీమ్లానాయక్ సినిమా పోస్ట్ పోన్ అయింది. దీంతో F3 Movie కోసం అనుకున్న ఫిబ్రవరి 25 తేదీని భీమ్లానాయక్ కు ఇచ్చేశారు నిర్మాత దిల్ రాజు. ఇక ఏప్రిల్ లో ఫస్ట్ వీక్ మహేష్ బాబు సర్కారువారి పాట సినిమా, సెకెండ్ వీక్ కేజీఎఫ్2 సినిమాలున్నాయి. అందుకే ఎఫ్3ను ఏప్రిల్ ఎండింగ్ లో థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు తాజాగా ప్రకటించారు.

f3 movie april 29 release

ప్రస్తుతం అనిల్ రావిపూడి ఈ సినిమాకు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. ఎఫ్2లో ఉన్నట్టుగానే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తమ పాత్రలను పోషిస్తున్నారు. సినిమాలో వెంకటేష్ కు రేచీకటి, వరుణ్ తేజ్ కు నత్తి. ఇక సునీల్ మాత్రం కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మరింత గ్లామర్ డోస్‌ను ఇచ్చేందుకు హీరోయిన్ సోనాల్ చౌహాన్‌ను కూడా కాస్టింగ్ లోకి తీసుకున్నారు.

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎఫ్ 3 కోసం సూపర్ హిట్ ఆల్బమ్‌ను రెడీ చేశారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా, తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. సో.. సమ్మర్ సోగ్గాళ్లతో ఈ వేసవి మరింత ఫన్ గా ఉండబోతోందన్నమాట.