పవన్-త్రివిక్రమ్ మూవీ

Wednesday,October 26,2016 - 12:50 by Z_CLU

కాటమ రాయుడు సినిమా షూటింగ్ లో ఓ వైపు బిజీగా ఉంటూనే మరో వైపు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్  సినిమా “దేవుడే దిగి వచ్చినా” కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు నవంబర్ 5 నుండి ఆ సినిమాని కూడా సెట్స్ పైకి తీసుకువస్తున్నాడు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. జల్సా, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఇచ్చిన ఈ కాంబోలో ఫస్ట్ టైం ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడు అనిరుద్. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాని ఇంచు మించు 85 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని సమాచారం.