ఐటెంభామగా అనసూయ..?
Wednesday,October 26,2016 - 12:42 by Z_CLU
టి.వి. షోల్లో కనిపిస్తూనే నచ్చిన క్యారెక్టర్ ఆఫర్ చేయాలే కానీ కలర్ ఫుల్ క్యారెక్టర్స్ తో మైమరిపించే అనసూయ ఇప్పటి వరకు తెలుగు తెరపై ఎన్నడూ చేయని మ్యాజిక్ చేయబోతుంది. యూత్ లో భీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న అనసూయ ఈసారి థియేటర్ లో కేకలు పెట్టించడానికి సిద్ధమైపోతుంది.

సాయి ధరం తేజ్ హీరోగా తెరకెక్కుతున్న “విన్నర్” లో ఐటం సాంగ్ చేయనుంది అనసూయ. కనెక్టింగ్ ఎలిమెంట్స్ ఉండాలే కానీ స్పెషల్ సాంగ్ అయినా సైడ్ అయ్యేది లేదని తేల్చేసింది అనసూయ. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో దూసుకు వెళ్తున్న తేజు “విన్నర్” అనౌన్స్ అయినప్పటి నుండే ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఆ ఎక్స్ పెక్టేషన్స్ కి ఇప్పుడు ఈ ఎక్జైట్ మెంట్ కూడా తోడైంది. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ కాని ఈ సినిమా పట్ల ఫిలిం నగర్ లో ఇప్పటికే వైబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి.