క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి...

Wednesday,October 26,2016 - 01:48 by Z_CLU

హీరో గా వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని… మరో సినిమాతో రెడీ అయిపోతున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ నేచురల్ స్టార్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో త్రినాధ్ రావు దర్శకత్వంలో ‘నేను లోకల్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో సంక్రాంతికి ముందే సందడి చేయాలనుకుంటున్నాడు నాని. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబర్ లో నేను లోకల్ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.

    నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయింది. ప్రసన్నకుమార్ కథ, మాటలు, స్క్రీన్ ప్లే  అందిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. వీలైనంత తొందరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి, క్రిస్మస్ కే సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాని-దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇదే.