Hari Hara Veeramallu మరో షెడ్యుల్ మొదలు

Thursday,April 07,2022 - 02:38 by Z_CLU

Pawan Kalyan’s ‘Hari Hara Veeramallu’ Shoot resumes from April 8th

గ్యాప్ దొరికినప్పుడల్లా ‘హరి హర వీరమల్లు’ సినిమాకు సంబంధించి షెడ్యుల్స్ పూర్తి చేస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా మరో భారీ షెడ్యుల్ స్టార్ట్ చేయబోతున్నాడు. కొంత బ్రేక్ తర్వాత మళ్ళీ ఈ పీరియాడిక్ హిస్టారికల్ డ్రామాకు సంబంధించి భారీ షెడ్యుల్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు యూనిట్. ఈ షెడ్యుల్ కోసం హైదరాబాద్ లో ఇప్పటికే ఓ భారీ సెట్ రెడీ చేశారు.

ఆ సెట్ లోనే ట్రైనింగ్ మరియు షూటింగ్ అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నారు. దాదాపు మూడు నెలలు పాటు షెడ్యుల్ జరగనుందని సమాచారం. రేపటి నుండి ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నారట. ఇందుకోసం పవన్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటూ హోం వర్క్ చేస్తున్నాడు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం మ్యచో లుక్ తో  పవన్ రిహార్సల్స్ చేస్తున్న వర్కింగ్ స్టిల్స్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం పవన్ డెడికేషన్ చూసి మూవీ లవర్స్ మెచ్చుకుంటున్నారు.

ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics