F3 పై అంచనాలు పెంచేసిన వరుణ్ తేజ్

Thursday,April 07,2022 - 03:34 by Z_CLU

‘F3’ Movie gonna be a feast for the Audience said Hero Varun Tej

విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ‘F2’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో దర్శకుడు అనిల్ రావిపూడి F3 అంటూ దానికి సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమా గురించి తాజాగా కొన్ని విషయాలు చెప్పుకున్నాడు వరుణ్ తేజ్. ‘గని’ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియా ముందుకొచ్చిన వరుణ్ తేజ్ ని  F3 గురించి అడగ్గా అంచనాలు పెంచేలా సమాధానం చెప్పాడు.

సీట్లో ఎవరూ కూర్చోరు. కామెడీకి కింద పడి దొల్లడం ఖాయం. కోవిడ్ ఎఫెక్జ్ట్ తర్వాత అందరూ తమ బాధల్ని మర్చిపోయేలా హిలేరియస్ ఫన్ సినిమా కోసం చూస్తున్నారు. అలా ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి F3 ఒక ఫీస్ట్ అవుతుంది. కామెడీ చాలా బాగా వచ్చింది. హిలేరియస్ ఫన్ తో సినిమా అందరినీ మెప్పిస్తుంది. ” అంటూ తన మాటలతో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేశాడు వరుణ్.

f3

షూటింగ్ స్టేజిలో ఉన్న F3 గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో గట్టిగా చెప్పుకుంటున్నారు. ఈసారి F2 కంటే ఎక్కువ మోతాదులో కామెడీ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు అనిల్ రావిపూడి. అందుకే సునీల్ తో మిగతా ఆర్టిస్టులను యాడ్ చేశాడు.  హిలేరియస్ అనిపించే కొన్ని బ్లాక్స్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తాయని ఇన్సైడ్ టాక్. ప్రస్తుతం షూటింగ్ ఎండింగ్ స్టేజికి చేరుకున్న ఈ సినిమా మే 27న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics