Pawan Kalyan’s ‘Hari Hara Veeramallu’ Shoot resumes from April 8th

Thursday,April 07,2022 - 02:38 by Z_CLU

గ్యాప్ దొరికినప్పుడల్లా 'హరి హర వీరమల్లు' సినిమాకు సంబంధించి షెడ్యుల్స్ పూర్తి చేస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్ తాజాగా మరో భారీ షెడ్యుల్ స్టార్ట్ చేయబోతున్నాడు. కొంత బ్రేక్ తర్వాత మళ్ళీ ఈ పీరియాడిక్ హిస్టారికల్ డ్రామాకు సంబంధించి భారీ షెడ్యుల్ మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నారు యూనిట్. ఈ షెడ్యుల్ కోసం హైదరాబాద్ లో ఇప్పటికే ఓ భారీ సెట్ రెడీ చేశారు.

ఆ సెట్ లోనే ట్రైనింగ్ మరియు షూటింగ్ అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నారు. దాదాపు మూడు నెలలు పాటు షెడ్యుల్ జరగనుందని సమాచారం. రేపటి నుండి ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నారట. ఇందుకోసం పవన్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటూ హోం వర్క్ చేస్తున్నాడు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ కోసం పవన్ రిహార్సల్స్ చేస్తున్న వర్కింగ్ స్టిల్స్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం పవన్ డెడికేషన్ చూసి మూవీ లవర్స్ మెచ్చుకుంటున్నారు.

ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.

 
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics