18 Pages గ్లిమ్స్ తో ఎట్రాక్ట్ చేసిన నిఖిల్ , అనుపమ

Thursday,April 07,2022 - 01:13 by Z_CLU

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో సెన్సేష‌నల్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ రాసిన స్టోరీతో హ్యాపెనింగ్ డైరెక్ట‌ర్ ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన 18 పేజెస్ మూవీ నుండి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. న్యూ యేజ్ ల‌వ్ స్టోరీతో యూత్ ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా గ్లిమ్స్ ప్రెజెంట్ యూత్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది.

నాకు తెలియ‌ని ఒక అమ్మాయి ఎప్పుడూ ఒక విష‌యం చెబుతూండేది..! ప్రేమించ‌డానికి కార‌ణ‌ముండ‌కూడ‌దు..ఎందుకు ప్రేమించామా..? అంటే ఆన్స‌ర్ ఉండకూడ‌దు..’ అని నిఖిల్ మాటలతో మొద‌లైన గ్లిమ్స్  ‘న‌న్న‌య్య రాసిన కావ్య‌మాగితే..తిక్క‌న తీర్చేనుగా..రాధ‌మ్మ ఆపిన పాట మ‌ధురిమ‌..కృష్ణుడు పాడెనుగా..’ అనే బ్యాక్ గ్రౌండ్ సాంగ్‌తో  సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది. అతి త‌ర్వ‌లో సినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు. 

 

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics