పవన్-త్రివిక్రమ్ మూవీ సెట్స్ లో ఖుష్బూ

Tuesday,April 11,2017 - 04:45 by Z_CLU

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం ఖుష్బూను తీసుకున్న విషయం కూడా పాతదే. లేటెస్ట్ డెవలప్ మెంట్ ఏంటంటే.. ఇవాళ్టి నుంచి ఖుష్బూ సినిమా సెట్స్ పైకి వచ్చారు. ఈరోజు పవన్-ఖుష్బూ-కీర్తి సురేష్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.

 

పవన్-త్రివిక్రమ్ సినిమా కోసం ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా 15 రోజులు కాల్షీట్లు కేటాయించారు ఖుష్బూ. ఈ 15 రోజుల్లో ఖుష్బూతో కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. మరీ ముఖ్యంగా పవన్-ఖుష్బూ కాంబోలో వచ్చే సన్నివేశాల్ని పిక్చరైజ్ చేస్తారు. మరో హీరోయిన్ అను ఎమ్మాన్యుయేల్ కు ఖుష్బూ పాత్రతో కనెక్షన్ లేదని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం హైదరాబాద్ లో భారీ సెట్ వేశారు. ఈ సెట్ లోనే ప్రస్తుత షూటింగ్ జరుగుతోంది. అనిరుధ్ ఈ సినిమాకు ఇప్పటికే కొన్ని సాంగ్స్ కంపోజ్ చేశాడు. సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి ఆగస్ట్ రెండోవారంలో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు.