`గౌతమిపుత్ర శాతకర్ణి` ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్
Monday,December 19,2016 - 06:40 by Z_CLU
ఇప్పటికే ట్రయిలర్ తో దుమ్ముదులుపుతున్న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా త్వరలోనే సాంగ్స్ తో కూడా అలరించనుంది. ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుకకు డేట్ ఫిక్స్ అయింది. తిరుపతిలో ఈనెల 26న గౌతమీపుత్ర శాతకర్ణి పాటల్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో ఈ వేడుకను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ వేడుకకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ ఆడియో ఫంక్షన్ తో సినిమా విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టు అవుతుంది.
ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. కరీంనగర్ జిల్లా కోటిలింగాల సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో 100 థియేటర్స్‌లో విడుదలైన గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో.. ఆడియోను కూడా గ్రాండ్ గా విడుదల చేయాలని నిర్ణయించారు. చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.