16న అజ్ఞాతవాసి టీజర్ లాంచ్

Tuesday,December 12,2017 - 01:01 by Z_CLU

అజ్ఞాతవాసి సినిమాకు సంబంధించి సెకెండ్ సింగిల్ రిలీజైంది. ఆ పాటతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్న టైమ్ లోనే మరో బొనాంజా అందించింది యూనిట్. ఈనెల 16న శనివారం రోజున టీజర్ కూడా రాబోతోందనేది ఆ గుడ్ న్యూస్. అందులో పవన్ కల్యాణ్ డాన్స్ మూమెంట్ కూడా ఉంటుందనే టాక్ రావడంతో పవనిజం డబుల్ అయింది.

టీజర్ రిలీజైన 3 రోజుల గ్యాప్ లో ఆడియో రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీని వేదికగా సెలక్ట్ చేశారు. టీజర్ రిలీజ్ తర్వాత ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తారు. వీలైనంత తొందరగానే అజ్ఞాతవాసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనేది ప్లాన్.

త్రివిక్రమ్ దర్శకత్వంలో దాదాపు వంద కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతోంది అజ్ఞాతవాసి సినిమా. కీర్తి సురేష్, అనూ ఇమ్మన్యువేల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో సీనియర్ నటి ఖుష్బూ కనిపించనున్నారు. అనిరుద్ మ్యూజిక్ కంపోజర్.