మరో షెడ్యూల్ పూర్తిచేసిన పవన్ కల్యాణ్

Friday,October 20,2017 - 12:04 by Z_CLU

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ చేస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ కంప్లీట్ అయింది. చిక్ మగళూరులో 3 రోజుల పాటు జరిగిన షెడ్యూల్ ముగిసింది. యూనిట్ అంతా హైదరాబాద్ చేరుకుంది. ప్రస్తుతానికి సినిమాకు సంబంధించి మిగిలింది ఒకే ఒక్క షెడ్యూల్ మాత్రమే.

ఆ షెడ్యూల్ కూడా యూరోప్ లో ప్లాన్ చేశారు. 15 రోజుల పాటు యూరోప్ లోని పలు దేశాల్లో షూటింగ్ చేయబోతున్నారు. ఆ షెడ్యూల్ తో టోటల్ సినిమా షూట్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత దశలవారీగా ప్రచారం కల్పించి, మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన కీర్తిసురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. పవన్ కల్యాణ్ కు ఇది కెరీర్ లో 25వ సినిమా.