అజ్ఞాతవాసి: కాశీలో ఆఖరి షెడ్యూల్

Monday,November 20,2017 - 07:02 by Z_CLU

పవన్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న అజ్ఞాతవాసి సినిమాకు సంబంధించి ఆఖరి షెడ్యూల్ డీటెయిల్స్ తెలిశాయి. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ ను వారణాసిలో ప్లాన్ చేశారు. లండన్ లో అవార్డు అందుకున్న పవన్ ఈరోజే హైదరాబాద్ తిరిగొచ్చారు. ఓ వారం రోజుల పాటు వ్యక్తిగత, రాజకీయ వ్యవహారాల్ని చక్కబెట్టి.. ఈనెల 27 నుంచి ఫైనల్ షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు.

ఈ మూవీకి సంబంధించి తాజాగా బల్గేరియాలో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేశారు. పవన్, అను ఎమ్మాన్యుయేల్ మధ్య కొన్ని సన్నివేశాలు పిక్చరైజ్ చేశారు. అలాగే పవన్-కీర్తి సురేష్ మధ్య ఓ సాంగ్ కూడా కంప్లీట్ చేశారు. వీటితో పాటు ఓ యాక్షన్ బ్లాక్ కూడా అక్కడే పూర్తిచేశారు. ఇప్పుడు మిగిలిన మరికొన్ని సన్నివేశాల్ని వారణాసిలో తీయబోతున్నారు.

అజ్ఞాతవాసి సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. ఈ సినిమా టైటిల్ ను వారణాసిలోనే అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారట. ప్రస్తుతానికైతే త్రివిక్రమ్ ఈ టైటిల్ కే ఫిక్స్ అయ్యాడు. ఆఖరి నిమిషంలో మార్పులు జరగకుండా ఉండే ఇదే టైటిల్ ను ప్రకటిస్తారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న అజ్ఞాతవాసి సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.