వెంకటేష్ కు నా కథ నచ్చింది

Monday,August 03,2020 - 02:12 by Z_CLU

హీరో వెంకటేష్, దర్శకుడు తరుణ్ భాస్కర్ కాంబినేషన్ లో సినిమా చాన్నాళ్లుగా డిస్కషన్ లో ఉంది. చాలామంది ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని కూడా అనుకుంటున్నారు. దీనిపై తరుణ్ భాస్కర్ క్లారిటీ ఇచ్చాడు.

– వెంకటేష్ గారితో సినిమా ఉంటుంది. నేను చెప్పిన స్టోరీలైన్ ఆయనకు బాగా నచ్చింది. ఇప్పటివరకు సినిమాల్లో వెంకటేష్ ను ఎంత ఎనర్జీతో, ఎంటర్ టైనింగ్ గా చూశామో.. రియల్ లైఫ్ లో ఆయన అంతకంటే ఎంటర్ టైనింగ్ గా ఉంటారు. నాకంటే యంగ్ గా ఆలోచిస్తారు. వెంకటేష్ కు చెప్పిన కథలో మార్పుచేర్పులు చేస్తున్నాను. అంతా బాగా వచ్చిందని నాకు అనిపించిన తర్వాతే వెంకటేష్ ను కలుస్తాను.

– ఈ లాక్ డౌన్ టైమ్ లో 4-5 స్టోరీలు రాస్తున్నాను. నేను చాలా స్లో రైటర్ ని. చాలామందికి ఈ విషయం తెలుసు. టైమ్ తీసుకొని మెల్లమెల్లగా రాస్తున్నాను. తొందరగా ఏదో రాసేసి చెత్త తీయాలని లేదు. మెల్లగా రాసినా మంచిగా రాస్తున్నా. 4 అయితే రెడీ అవుతాయి. లాక్ డౌన్ తర్వాత తప్పకుండా బిజీ అవుతా.

– ఓ టీవీ ఛానెల్ పై కూడా కథ రాస్తున్నాను. రీసెంట్ గా కప్పెళ సినిమా టైమ్ లో నాపై చాలా ట్రోలింగ్ నడిచింది. ఆ అనుభవాలు కూడా నాకు కథ రాయడానికి ఉపయోగపడతాయి.