'పేపర్ బాయ్' టీజర్ కి మంచి రెస్పాన్స్

Saturday,July 28,2018 - 11:55 by Z_CLU

సంపత్ నంది నిర్మాతగా సంతోష్ శోభన్, రియా సుమన్, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం ‘పేపర్ బాయ్’.. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ 2.5 మిలియన్ డిజిటల్ వ్యూస్ తో యు ట్యూబ్ లో రికార్డు  సృష్టించింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ త్వరలో సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అలాగే సినిమాలోని మొదటి పాటను ఈరోజు (జులై 28) సాయంత్రం రిలీజ్ చేస్తామని చెప్పారు.

పేపర్ బాయ్ గా పనిచేస్తూ ఓ అమ్మాయిని లవ్ చేసే  ఇంజనీరింగ్ చదివే కుర్రాడి చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమాకి జయ శంకర్ దర్శకత్వం వహించగా బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సంగీతం, సౌందర్య రాజన్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తించారు..

తారాగణం :
సంతోష్ శోభన్, రియా సుమన్, తాన్య హోప్, పోసాని కృష్ణ మురళి, అభిషేక్ మహర్షి, విద్యు రామన్ , జయప్రకాష్ రెడ్డి, బిత్తిరి సత్తి, సన్నీ, మహేష్ విత్తా మరియు ఇతరులు

సాంకేతిక నిపుణులు :
దర్శకుడు: జయశంకర్
నిర్మాతలు: సంపత్ నంది, రాములు, వెంకట్ మరియు నరసింహ
బ్యానర్లు: సంపత్ నంది టీం వర్క్స్, BLN సినిమా మరియు ప్రాచిత్ర క్రియేషన్స్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: సౌందర్య రాజన్‌
ఎడిటర్: తమ్మి రాజు
ఆర్ట్ డైరెక్టర్: రాజీవ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళీ మామిళ్ల
స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్ : సుధాకర్ పావులూరి