పేపర్ బాయ్ రిలీజ్ డేట్ ఫిక్సయింది

Wednesday,August 08,2018 - 05:59 by Z_CLU

పేపర్ బాయ్ రిలీజ్ డేట్ ఫిక్సయింది. సంతోష్ శోభన్ సరసన రియా సుమన్, తాన్యా హాప్ నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 7 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. సంపత్ నంది కథనందించిన ఈ సినిమాకి జయశంకర్ దర్శకత్వం వహించాడు.

రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా టీజర్ తో పాటు 2 సాంగ్స్ రిలీజ్ చేశారు ఫిలిమ్ మేకర్స్. అల్టిమేట్ యూత్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యూత్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా సినిమాలోని ఫస్ట్ సాంగ్, మాస్ ఆడియెన్స్ ని ఈజీగా కనెక్ట్ అయిపోయింది.

ఈ రోజే రిలీజ్ డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఫిలిమ్ మేకర్స్, ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకునే ప్రాసెస్ లో ఉన్నారు.  సంపత్ నంది నిర్మిస్తున్న ఈ సినిమాకి భీమ్స్ మ్యూజిక్ కంపోజర్.