నేను ఎవర్నీ పెళ్లి చేసుకోవడం లేదు

Saturday,July 28,2018 - 12:01 by Z_CLU

మొన్నటివరకు తమన్న పర్సనల్ లైఫ్ పై చాలా రూమర్లు వచ్చాయి. త్వరలోనే మిల్కీబ్యూటీ పెళ్లి చేసుకోనుందని, అతడు అమెరికాలో పెద్ద డాక్టర్ అంటూ పుకార్లు వచ్చాయి. స్టార్టింగ్ లో లైట్ తీసుకున్న తమన్న, రోజురోజుకు రూమర్లు ఎక్కువవ్వడంతో ఇక రెస్పాండ్ అవ్వక తప్పలేదు.

“ఒకరోజు హీరోతో పెళ్లి అంటారు. మరో రోజు క్రికెటర్ తో అంటారు. ఇప్పుడు డాక్టర్ అంటున్నారు. ఈ రూమర్లు చూస్తుంటే నేను భర్త కోసం షాపింగ్ చేస్తున్నట్టుంది. ప్రస్తుతం నేను సింగిల్ గా హ్యాపీగా ఉన్నాను. నా తల్లిదండ్రులు కూడా నాకోసం ఎలాంటి సంబంధాలు చూడడం లేదు.”

ఇలా తన పెళ్లిపై పూర్తి క్లారిటీ ఇచ్చింది తమన్న. ఒకవేళ పెళ్లి చేసుకునే టైమ్ వస్తే అప్పుడు అందరికీ చెప్పి చేసుకుంటానని అంటోంది ఈ బ్యూటీ. తమన్న నటిస్తున్న దటీజ్ మహాలక్ష్మి షూటింగ్ పూర్తిచేసుకుంది. మరోవైపు సైరా షూటింగ్ కొనసాగుతోంది. వీటితో పాటు ఎఫ్-2 సినిమాలో వెంకీ సరసన నటిస్తోంది ఈ బ్యూటీ.